తల్లి, కొడుకులను చంపి వ్యక్తి ఆత్మహత్య

957చూసినవారు
తల్లి, కొడుకులను చంపి వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో తల్లి, కొడుకులను హత్య చేసి వ్యక్తి ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. జక్కని సత్యనారాయణ అనే వ్యక్తి తన తల్లి శారద, కొడుకు సురేష్‌లను హత్య చేసి, అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. సమాచారం అందిన వెంటనే సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ శ్రీను, ఎస్సై సౌజన్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్