హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు కాయిత వెంకటరెడ్డి (70) మృతి చెందారు. ఆరు నెలల వ్యవధిలోనే ఈ కుటుంబంలో తండ్రీకొడుకులను రోడ్డు ప్రమాదాలు బలితీసుకోవడం విషాదాన్ని నింపింది. సాయంత్రం 4 గంటల సమయంలో తన వ్యవసాయ పొలానికి వెళ్తున్న వెంకటరెడ్డిని, శుభం గార్డెన్ సమీపంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన సుమారు 50 అడుగుల దూరం ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలవ్వడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.