Dec 29, 2025, 14:12 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి విశ్రాంత పోలీసుఅధికారుల సమస్యల పరిష్కారానికి కృషి
Dec 29, 2025, 14:12 IST
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం విశ్రాంత పోలీసు ఉద్యోగుల క్యాలెండర్ ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్రాంత పోలీసు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, వారు రోజు వ్యాయామం, యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.