Apr 16, 2026, 13:04 IST/
తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షాలు
Apr 16, 2026, 13:04 IST
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని గద్వాల(D) ఇటిక్యాల(M)లో భారీ వర్షం కురిసింది. ఉరుములతో కూడిన వర్షం దంచికొట్టింది. అటు ఏపీలోని నంద్యాల, కర్నూల్, అల్లూరి జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి. ఇక రేపు మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, NLR, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43-44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని APSDMA తెలిపింది. మన్యం, విజయనగరం, SKLM, అల్లూరి, పోలవరం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది.