Apr 11, 2026, 14:04 IST/
ట్రంప్‌తో తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూ .. వీడియో వైరల్
Apr 11, 2026, 14:04 IST
తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటిస్తున్న 'గాయపడ్డ సింహం' చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం చేపట్టిన వినూత్న ప్రమోషన్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడితో తరుణ్ కాఫీ తాగుతూ, తన డిపోర్టేషన్ గురించి ప్రశ్నించే AI క్రియేటెడ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వినూత్న ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాపై ఆసక్తి పెంచడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.