
పెరిగిన చలి.. బయటకు రావొద్దు!
తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదు కావచ్చని హెచ్చరించింది. రేపు, ఎల్లుండి ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, SRD, MDK, కామారెడ్డి జిల్లాల్లో చల్లటి గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి చేసింది. ఉదయం, రాత్రి వేళల్లో అవసరమైతేనే తప్ప బయటికి రావద్దని ప్రజలకు సూచించింది.































