పిల్లుట్ల గేట్ వద్ద ద్విచక్ర వాహనం ఢీ, యువకుడికి తీవ్ర గాయాలు

1004చూసినవారు
పిల్లుట్ల గేట్ వద్ద ద్విచక్ర వాహనం ఢీ, యువకుడికి తీవ్ర గాయాలు
మెదక్ జిల్లా, శివంపేట్ మండలం పరిధిలోని పిల్లుట్ల గేట్ సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్