అల్లాదుర్గం వద్ద బైక్ ప్రమాదం.. తల్లి–కొడుకులకు గాయాలు

1034చూసినవారు
అల్లాదుర్గం వద్ద బైక్ ప్రమాదం.. తల్లి–కొడుకులకు గాయాలు
అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ శివారులోని 161వ జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి వైపు బైక్‌పై వెళ్తున్న శివ, సోనీ అనే తల్లికొడుకులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, బాధితులను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్