నర్సాపూర్ మండలంలోని నత్నాయపల్లి గ్రామానికి చెందిన పాడిరైతు ఉషన్నగారి శ్రీనివాస్‌కు చెందిన లేగదూడను హైనా దాడి చేసి చంపినట్లు అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సాయిరాం తెలిపారు. పాల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న శ్రీనివాస్, ఈ సంఘటనతో సుమారు రూ.15 వేల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆయన కోరారు.