మెదక్: డీసీఎం, ఆటో ఢీ.. పలువురికి గాయాలు

288చూసినవారు
మెదక్: డీసీఎం, ఆటో ఢీ.. పలువురికి గాయాలు
సోమవారం హవేలిఘన్పూర్ మండలంలోని శమనాపూర్ శివారులో డీసీఎం, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్కు చెందిన బోయిని రమేష్ తో పాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రామాయంపేట నుంచి మెదక్ వైపునకు వెళ్తున్న ఆటోను, మెదక్ నుంచి ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. గాయపడిన వారిని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్