మెదక్: కుటుంబ కలహాలతో కూలీ ఆత్మహత్య

625చూసినవారు
మెదక్: కుటుంబ కలహాలతో కూలీ ఆత్మహత్య
చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో కూలీ ఎర్రోళ్ల పోచయ్య (47) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 21న మద్యం మత్తులో భార్య, కుటుంబ సభ్యులతో గొడవపడి మనస్థాపానికి గురై పురుగుల మందు తాగినట్లు స్థానికులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ విఠల్ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్