మెదక్: బోరుబావి వివాదంలో హత్య: పంపరి నాగేందర్‌కు జీవిత ఖైదు

856చూసినవారు
మెదక్: బోరుబావి వివాదంలో హత్య: పంపరి నాగేందర్‌కు జీవిత ఖైదు
మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో బోరుబావి వివాదంలో చలిమల రమేష్ గౌడ్(45)ను గొడ్డలితో హత్య చేసిన కేసులో నిందితుడు పంపరి నాగేందర్‌కు జిల్లా న్యాయమూర్తి నీలిమ జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ హత్య 2021 సెప్టెంబర్ 8న జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. నేరం రుజువైనట్లు వివరించిన ఎస్పీ, నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అభినందించారు.

సంబంధిత పోస్ట్