నస్కల్–చల్మెడ రహదారిపై రోడ్డు ప్రమాదం

673చూసినవారు
నస్కల్–చల్మెడ రహదారిపై రోడ్డు ప్రమాదం
నిజాంపేట మండలం నగరం గ్రామ పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నస్కల్ నుంచి చల్మెడకు బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని టాటా ఏసీ వాహనం ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్