నార్సింగిలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి

1336చూసినవారు
నార్సింగిలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి
నార్సింగి గ్రామంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫిరంగి సత్యనారాయణ (50) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కూతురి వివాహం కోసం డబ్బులు సమకూర్చే ప్రయత్నంలో సహాయం లభించక మనస్తాపానికి గురై, గ్రామ శివారులోని పాడుబడిన రైస్ మిల్లులో ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.