Jan 26, 2026, 15:01 IST/సిద్దిపేట
సిద్దిపేట
సిద్దిపేట: పీఆర్సీపై ప్రశ్నిస్తే ఏసీబీ దాడులు: హరీశ్ రావు
Jan 26, 2026, 15:01 IST
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని, ఉద్యోగుల పీఆర్సీ గురించి అడిగితే ఏసీబీ దాడులతో, ప్రశ్నిస్తే సిట్ నోటీసులతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం 72% పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను గౌరవించుకుందని, నేడు ఉద్యోగ సంఘాల నాయకులు కనీసం పీఆర్సీ గురించి అడిగే పరిస్థితి లేదని, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై దాడులు చేస్తున్నారని, కాంట్రాక్టులకు టెండర్లు పిలిచి కమీషన్ల కోసం బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఏడాది గడిచినా డబ్బులు రావడం లేదని, కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రతిష్ట, ఆదాయం పెరిగిందని, రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అంధకారంలోకి నెట్టబడి దివాలా తీస్తోందని విమర్శించారు.