నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం - Narayankhed Constituency

నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా అబ్దుల్ కాలం జయంతి వేడుకలు

నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా అబ్దుల్ కాలం జయంతి వేడుకలు

సంగారెడ్డి జిల్లా, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గంలోని నాగన్‌పల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఏ. పి. జె. అబ్దుల్ కలాం జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను, విద్య, విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన కృషిని స్మరించుకున్నారు. సాధారణ కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగి, యువతకు స్ఫూర్తిగా నిలిచిన కలాం జీవితం ఆదర్శప్రాయమని, నేటి యువత ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

వీడియోలు


సంగారెడ్డి జిల్లా