నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం పరిధిలోని రాపర్తి గ్రామ రైతులు ప్రభుత్వాన్ని 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందేదని, ప్రస్తుతం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సరఫరా అవుతోందని, దీనివల్ల పంట పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ విద్యుత్ అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం వల్ల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.