
ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ బీభత్సం (వీడియో)
TG: ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై తొర్రూరు మండలం నాంచారి మడూరు వద్ద ఓ గ్రానైట్ లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ నుండి కాకినాడ పోర్ట్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే రహదారిపై గ్రానైట్ లారీల వల్ల జరుగుతున్న వరుస ప్రమాదాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.




