పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమం

3చూసినవారు
పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమం
నారాయణఖేడ్ పట్టణంలోని బసవేశ్వర్ చౌక్ లేబర్ అడ్డాలో షీ టీమ్ ఆధ్వర్యంలో పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ తులసీరామ్, మహిళా పోలీస్ కానిస్టేబుల్ చాంగు బాయ్ కార్మికులకు ఈ అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై వేధింపులు జరిగితే షీ టీమ్ (8712656772), అత్యవసర పోలీసు సహాయం (100), సైబర్ మోసాల ఫిర్యాదుల కోసం (1930), టీ-సేఫ్ సేవలను వినియోగించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్