నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి

1244చూసినవారు
నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి
కంగ్టి మండలం నాగన్‌పల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు షహీద్ భగత్‌సింగ్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం, దేశభక్తి, ధైర్యం, త్యాగం వంటి విలువలను విద్యార్థులకు వివరించారు. చిన్న వయసులోనే భగత్‌సింగ్ చూపిన తెగువ, అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్