భగత్ సింగ్ జయంతి: నాగన్ పల్లిలో యువత నివాళులు

1093చూసినవారు
భగత్ సింగ్ జయంతి: నాగన్ పల్లిలో యువత నివాళులు
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ కంగ్టి మండలం నాగన్ పల్లిలో ఆదివారం భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్ర సమర పోరాటంలో భగత్ సింగ్ ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచారని మాజీ సర్పంచ్ సిద్ధారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్