టికెట్ స్క్వాడ్ మీద చెప్పుతో దాడి చేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్

0చూసినవారు
లంచం డిమాండ్ చేశాడని టికెట్ స్క్వాడ్ అధికారిపై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. తాను లంచం డిమాండ్ చేయలేదని, కండక్టర్ వసంత్ మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి టికెట్‌ను ఒక పురుష ప్రయాణికుడికి ఇచ్చాడని, ఈ విషయంపై మెమో జారీ చేస్తామని చెప్పడం వల్లే వసంత్ లంచం డిమాండ్ చేసినట్లు ప్రచారం చేశాడని టికెట్ స్క్వాడ్ అధికారి ప్రకాష్ తెలిపారు. ప్రయాణికుల్ని రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడని, వసంత్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నాయని ఆయన ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్