సంగారెడ్డి: బీఆర్ఎస్ రాజతోత్సవ సభ జయప్రదం చేయాలి

హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి లో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. మనూర్ లో కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పారు. మండలం నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు.
