సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద ఆర్టీసీ బస్సు తనిఖీల్లో హైడ్రామా చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న బస్సులో టికెట్ లేని ప్రయాణికుడిని పట్టుకున్న టికెట్ స్క్వాడ్ అధికారి, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు కండక్టర్, ప్రయాణికుడి నుండి రూ. 20 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ అవినీతి డిమాండ్‌తో ఆగ్రహించిన కండక్టర్ సదరు అధికారిని చెప్పుతో కొట్టగా, ప్రయాణికులు కూడా కలిసి దాడికి దిగారు.