హనుమాన్ ఆలయంలో భక్తుల రద్దీ, అన్నదాన కార్యక్రమాలు

3చూసినవారు
మనూర్ మండలం డవ్వూరు హనుమాన్ లొంక వద్ద శనివారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ఉండటంతో విద్యార్థులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చారు. ప్రతి శనివారం ఇక్కడ ప్రత్యేక అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నారాయణఖేడ్ చుట్టుపక్కల నుంచి భక్తులు వచ్చి శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుంటున్నారు. అన్నదానం చేసేందుకు భక్తులు తమ పేర్లను ముందస్తుగా నమోదు చేసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్