హైదరాబాదులోని తన స్వగృహంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. సంగారెడ్డి జిల్లా
కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షుడిగా పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నియమితులైన సందర్భంగా ఆయనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాలువా కప్పి, బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని, జిల్లాలో
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేశారు.