నారాయణఖేడ్ లో బుధవారం మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ,
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులను
కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.