కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

1చూసినవారు
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని ఖానాపూర్ (బి) గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణనాథుడిని దర్శించుకున్న భక్తులకు కమిటీ సభ్యులు అన్నప్రసాదాన్ని అందించారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్