ఇందిరా నగర్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

0చూసినవారు
ఇందిరా నగర్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని ఇందిరా నగర్ గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగన్న, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, కల్హేర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాచేందర్, జ్ఞానేశ్వర్, గోపి సర్, మోతీరాం, నరేష్, తౌర్య నాయక్, భీమయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే తమ లక్ష్యమని, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శకంగా రేషన్ పంపిణీ జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్