సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఆదర్శ అమ్మ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు యూనిఫామ్, షూస్, బెల్ట్‌లను పంపిణీ చేశారు. పాఠశాల కమిటీ చైర్మన్ మల్లేశ్వరి, ప్రధానోపాధ్యాయులు రాములు రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి
ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది,
విద్యార్థులు పాల్గొన్నారు.