ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దళారులు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ చలపతిరావు హెచ్చరించారు. ఇళ్లు ఇప్పిస్తామంటూ ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే నమ్మవద్దని, అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పథకం అమలులో పారదర్శకత పాటిస్తామని, కేవలం అర్హులకే ఇళ్లు అందుతాయని పేర్కొన్నారు. ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే నెం. 1800-599-5991ను సంప్రదించాలన్నారు.