సిర్గాపూర్ మండలంలో ఎస్సై మహేష్ కుమార్ ఆధ్వర్యంలో 'రాష్ట్రీయ ఏక్త రన్ ఫర్ యూనిట్' కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి కడ్పల్ రోడ్ సబ్స్టేషన్ వరకు రెండు కిలోమీటర్ల మేర జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ యువకులు, పెద్దలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపులో విద్యార్థులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేసి, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.