
న్యూ ఇయర్ వేళ 56 శాతం పెరిగిన డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరం వేళ డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు గత ఏడాదితో పోలిస్తే 56 శాతం పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ వేళ 868 డ్రంకెన్ డ్రైవింగ్ చలాన్లు జారీ చేశారు. గత ఏడాది ఇదే రోజు ఈ సంఖ్య 558గా ఉంది. పటిష్టమైన ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడం, ప్రత్యేక బృందాలను మోహరించడం, సీసీటీవీ నిఘా వంటి చర్యల వల్ల కేసుల సంఖ్య పెరిగిందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రంతా బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు.




