మనూర్ జెడ్పిటిసి రేసులో మాజీఎంపీటీసీ

1067చూసినవారు
మనూర్ జెడ్పిటిసి రేసులో మాజీఎంపీటీసీ
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపిటిసి రవీందర్, మండల జెడ్పిటిసి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎంపీ సురేష్ శెట్కర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తానని ఆదివారం తెలిపారు. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రవీందర్, ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారం చేస్తానని, మనూరు మండలం జెడ్పిటిసి ఎస్సీ రిజర్వేషన్ అయినందున తనకు కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పించాలని ఎంపీ, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నారు.