సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని మర్వేల్లి గ్రామంలో లింగాయత్, యాదవ సోదరులు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ ట్రెడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతూ, సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. నేటి యువతలో భక్తి, ఆధ్యాత్మిక చింతనతో పాటు ఐక్యత, సేవా భావం పెంపొందించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.