
వివాహేతర సంబంధం.. యువకుడిని కొట్టి చంపారు!
TG: సిద్దిపేట(D) రాయపోల్ (M)లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిని కొట్టి చంపారు. రాంసాగర్ గ్రామానికి చెందిన శ్యామ్ అదే గ్రామానికి చెందిన వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని సమాచారం. ఈ విషయంలో సదరు మహిళకు భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో విడాకులకు కారణం శ్యామ్ చారినే అని భావించిన మహిళ బంధువులు అతడిపై దాడి చేశారు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.




