మార్గశిర మాసం కృష్ణ పక్షం, తేది 4-12-2025 గురువారం నాడు నారాయణఖేడ్ దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీ గురు దత్త పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 6 గంటలకు గణపతి, గౌరీ పూజతో ప్రారంభమై, శ్రీ గురు దత్తాత్రేయ స్వామికి విశేష అభిషేకం, మూల మంత్ర హవనం, గీతా స్వాకారం, పూర్ణహుతి, మంగళ హారతి, డోలారోహనం, పల్లకి సేవ వంటి కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి గురు కృప పొందాలని కోరారు.