కంగ్టి మండల పరిధిలోని ముర్కుంజాల్ గ్రామంలోని 8వ వార్డులో పనిచేయకుండా ఉన్న చేతి పంపును గ్రామ సర్పంచ్ సారంగి అనూష లాల్ కుమార్ చొరవతో మరమ్మతు చేయించారు. చేతి పంపు తిరిగి అందుబాటులోకి రావడంతో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు.