సంగారెడ్డి: హనుమాన్ శోభాయాత్రలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

76చూసినవారు
సంగారెడ్డి: హనుమాన్ శోభాయాత్రలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ
హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్ర ర్యాలీలు శనివారం ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శోభయాత్రలకు పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలు, రూమర్లు నమ్మవద్దని సూచించారు. రూమర్లను ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్