కారాముంగి గ్రామంలో మండల పరిషత్ పాఠశాల కాంపౌండ్ వాల్, సి. సి. రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల సంజీవ్ రెడ్డిని 4వ వార్డు సభ్యులు మడివాళ్ల గోవింద్ శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాటిల్ రవికుమార్, ఉప సర్పంచ్ విశ్వనాథ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.