లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడిన జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నప్పటికీ, 11 రాష్ట్రాల్లో మాత్రం ఓబీసీగా పరిగణించడం అన్యాయమని చెప్పారు. ఇది సమాన అవకాశాలను హరిస్తుందని పేర్కొంటూ, కేంద్రం తక్షణమే చొరవ చూపాలని కోరారు.