కృష్ణాపూర్ విద్యార్థినులు ఖో-ఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

4చూసినవారు
కృష్ణాపూర్ విద్యార్థినులు ఖో-ఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం, కృష్ణాపూర్ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థినులు సి. హెచ్. హరిత మరియు డి. ముస్కాన్, తూప్రాన్ లోని కళాశాలలో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి ఖో-ఖో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ రాష్ట్రస్థాయి పోటీలు నల్లగొండ జిల్లాలోని ఆలియాలో అక్టోబర్ రెండో వారంలో జరగనున్నాయి. ఎంపికైన విద్యార్థినులను, వారికి శిక్షణ ఇచ్చిన పీఈటీ రాములు ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

సంబంధిత పోస్ట్