సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కల్హేర్ మండలం రాపర్తి గ్రామంలోని యోగేశ్వర గణేష్ మండలం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మహిళలు సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమాన్నిసోమవారం ఘనంగా నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యువత, నిర్వాహకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.