ప్రేమ పెళ్లి.. అబ్బాయి ఇంటికి నిప్పు

5చూసినవారు
ప్రేమ పెళ్లి.. అబ్బాయి ఇంటికి నిప్పు
ఝరసంగం మండలంలో ప్రేమ వివాహం చేసుకున్న యువతి కుటుంబీకులు దారుణానికి ఒడిగట్టారు. కొద్ది రోజుల క్రితం విరల్ కూతురు అదే గ్రామ వాసి రాధాకృష్ణు పెళ్లి చేసుకుంది. ఈ వివాహాన్ని ఇష్టం లేని యువతి తండ్రి, తన కొడుకుతో కలిసి యువకుడిపై, అతని తండ్రిపై దాడి చేసి వారి ఇంటికి నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్