మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, 12 జనవరి 2026, సోమవారం ఉదయం 9:00 గంటలకు శ్రీ భక్త మార్కండేయ ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయి. కళాశాల విద్యార్థులు, గృహిణులు, మహిళలు తమ రంగులను తీసుకురావాలి. విజేతలకు శ్రీ దుర్గా లైఫ్ కేర్ హాస్పిటల్ సహకారంతో ప్రథమ బహుమతి రూ. 5116, ద్వితీయ బహుమతి రూ. 3116, తృతీయ బహుమతి రూ. 2116 అందజేయబడతాయి. పోటీలో పాల్గొన్న ప్రతి గ్రూపుకు బహుమతులు, అన్నప్రసాద వితరణ మధ్యాహ్నం 12:30 గంటలకు ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ శ్రీమతి ఉమా హారతి, శ్రీమతి ఉమాదేవి షేట్కార్, శ్రీమతి పట్లోళ్ల అనుపమ రెడ్డి, శ్రీమతి మహారెడ్డి జయశ్రీ రెడ్డి హాజరవుతారని శ్రీ భక్త మార్కండేయం నాఖేడ్ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.