సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ శివారులోని మన్సూర్పూర్ వాగు పొంగిపొర్లడంతో నారాయణఖేడ్ – కంగ్టి – పిట్లం రహదారిపై రాకపోకలు శనివారం నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం, మధ్యాహ్నం కురిసిన అతివృష్టి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.