మనూరు: 'చెరుకు రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి'

1332చూసినవారు
మనూరు: 'చెరుకు రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి'
మనూరు మండలం తోర్నాల్ గ్రామంలో చెరుకు రైతులతో సైంటిస్ట్ విజయ్ కుమార్, వ్యవసాయ అధికారులు సమావేశమయ్యారు. రైతులు ప్రత్యేక శ్రద్ధతో చెరుకు సాగు చేస్తున్నారని, అధిక దిగుబడులు సాధించేందుకు సస్యరక్షణ చర్యలు, సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా సైంటిస్ట్ విజయ్ కుమార్ రైతులకు సూచనలు అందించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చెరుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల ఆదుకోవాలని సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్