మనూర్ మండలంలోని బోరంచ పర్యాటక అభివృద్ధికి 2.05 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి గురువారం తెలిపారు. టూరిజం కార్యదర్శి జయేష్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో బోరంచ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారు.