8వ వార్డులో వారం రోజులుగా మిషన్ భగీరథ నీరుకు అంతరాయం

0చూసినవారు
8వ వార్డులో వారం రోజులుగా మిషన్ భగీరథ నీరుకు అంతరాయం
నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డులో గత వారం రోజుల నుండి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ నీరు నారాయణఖేడ్ నుండి మన్సూర్ మీదుగా వేరే ప్రాంతాలకు వెళ్లినప్పటికీ మున్సిపల్ లో 8వ వార్డు ఉండి కూడా నీరు రాకపోవడం గమనార్హం. మున్సిపాలిటీ అధికారులు మిషన్ భగీరథ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెంటనే నీరు విడుదల చేయాలనీ మిషన్ భగీరథ పనులు అంతరాయంలో ఏదైనా సమస్యలు ఉంటే అధికారులు వెంటనే మరమ్మత్తులు చేసి నీరును వదలాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్