మనూరు మండలం తుమ్మూరు గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న కురుమ సంఘ భవనానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కురుమ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేను కురుమ సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిగంబర్ రెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.